//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంకాసేపట్లో టీడీపీ మంత్రుల రాజీనామా..!

Category : politics

మరి కొద్దిసేపటి లో టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయనున్నారు. సుజనా చౌదరి, అశోకగజపతిరాజు ప్రధాని మోదీని కలిసి రాజీనామా లేఖలు అందజేయనున్నారు. దాంతో పాటు రాజీనామాలకు దారితీసిన పరిస్థితులను మోదీకి వివరించనున్నారు.

ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ విభజన చేసేవాళ్లు కూడా అశాస్త్రీయమని అంటున్నారని, కానీ విభజన హామీలు అలాగే ఉండిపోయాయని, ఇలా ఉంటే ఏపీ అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

నాలుగేళ్లయిన విభజన హామీలు నెరవేరలేదనే భావన రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లిపోయిందని, ఏపీలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదేనినని అశోక్‌గజపతిరాజు అన్నారు. భారత దేశంలో ఏపీ ఒక భాగమని, విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు సరిగా అమలుజరగడం లేదని, ఇలాంటి సమయంలో ఎన్డీయేతో మిత్ర పక్షంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు.

దీంతో కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించిందని, దీంతో పీఎం అపాయింట్ కోరామని మోదీకి మర్యాదపూర్వకంగా రాజీనామా లేఖలు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పి వస్తామని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఈ ఉదయమే ప్రధానికి రాజీనామా లేఖలు అందజేయాలని అనుకున్నా మోదీ రాజస్థాన్ పర్యటనలో ఉండడంతో కుదరలేదు. దీంతో టీడీపీ కేంద్ర మంత్రులు ఈ సాయంత్రం మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.