Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాడేపల్లిగూడెం టీడీపీ అభ్యర్థి ఫైనల్ ... బాపిరాజు కు నో ఛాన్స్

Category : politics state

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు . ఈసారి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దింపాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఒకటికి పదిసార్లు సర్వేలు నిర్వహించి గెలుస్తారని భావించిన వారికి టికెట్ల కేటాయింపు చేస్తున్నారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈలి నాని పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. చివరి వరకు బాపిరాజు పేరును చంద్రబాబు పరిశీలించారు. అయితే కుల సమీకరణాల కారణంగా ఈలి నాని వైపే మొగ్గు చూపారు. ఇక మొదటి నుంచి టికెట్ ఆశలు పెట్టుకున్న బాపిరాజును చంద్రబాబు బుజ్జగించారు.

సమీకరణాల వల్ల టిక్కెట్ ఇవ్వలేకపోయానని బాపిరాజుకు ఆయన చెప్పారు. తాడేపల్లిగూడెం స్థానాన్ని గెలిపించే బాధ్యత బాపిరాజుకు అప్పగించారు. తాడేపల్లిగూడెంలో టిడిపి విజయం సాధించాలని, ఈలి నాని ని గెలిపించాల్సిన బాధ్యత మీదేనంటూ బాపిరాజుకు చెప్పారు.. భవిష్యత్తులో బాపిరాజుకు అన్ని రకాలుగా ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మొత్తానికి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈలి నాని బరిలోకి దిగడం ఫైనల్ చేశారు టి డి పీ బాస్.

Related News