//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులు... పలువురికి గాయాలు

Category : state politics national

బీజేపీ, టీడీపీ పార్టీల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న ఈ పార్టీల నేతలు ఇప్పుడు బౌతిక దాడులకు తెగబడుకుంటున్నారు. శుక్రవారం ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ప్రదాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, టీడీపీల మధ్య మరింత ఆజ్యాన్ని పోశాయి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. నెల్లూరులోని గాంధీ బొమ్మ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

బాలకృష్ణకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన చేశారు. పోటాపోటీగా మోదీకి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టింది. దీంతో నెల్లూరు రణరంగంగా మారింది. ఆందోళనలు శృతి మించడంతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు రెండు వర్గాలను శాంతింపజేసి ఉద్రిక్త పరిస్థితి గాడిలో పెట్టారు. పోలీసులు ఇరువర్గాలను కట్టడి చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

అంతే కాకుండా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను ఏపీ బీజేపీ నేతలు శనివారం ఉదయం కలుసుకున్నారు. నిన్న సీఎం చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నరసింహన్‌ను కలిసినవారిలో విష్ణుకుమార్‌రాజు, మధవ్‌ తదితరులు ఉన్నారు.