//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెచ్1బీ దరఖాస్తులను మూడోవంతు తగ్గించుకున్న టీసీఎస్

Category : business

మన దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది హెచ్1బీ వర్క్ వీసా దరఖాస్తులను భారీగా తగ్గించుకుంది. 2015 పోలిస్తే సంస్థ దరఖాస్తులు మూడో వంతుకు తగ్గాయి. అమెరికాలో ఆన్‌సైట్ కార్యకలాపాల కోసం సంస్థ ఆ దేశ ఇంజినీరింగ్ కాలేజీలు, బిజినెస్ స్కూళ్ల నుంచి నియామకాలను పెంచింది. తద్వారా టీసీఎస్.. హెచ్1బీ వీసాలపై ఆధార పడటాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగింది. 

అమెరికాలో హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దేశీయ కంపెనీలపై ఒత్తిడి పెంచడంతో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ ఐటీ కంపెనీలన్నీ అక్కడివారికే అవకాశాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. దేశీయ ఐటీ ఎగుమతుల్లో 60 శాతం వాటా అమెరికా మార్కెట్‌దే కావడంతో వచ్చే రెండేండ్లలో అమెరికాలో 10 వేల మంది స్థానికులను నియమించుకోనున్నట్లు ఇప్పటికే ఇన్ఫోసిస్  ప్రకటించింది. 

"గడిచిన కొన్నేండ్ల నుంచి అమెరికాలో స్థానికుల నియామకాలను గణనీయంగా పెంచాం. ఇండియా మార్కెట్లో మాదిరిగానే అమెరికాలోని పలు విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం" అని టీసీఎస్‌లో మానవ వనరుల విభాగ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజోయ్ ముఖర్జీ కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అమెరికాలోని వందకు పైగా ఇంజినీరింగ్ క్యాంపస్‌లు, బిజినెస్ స్కూళ్ల నుంచి సంస్థ ఉద్యోగులను నియమించుకుంటున్నదని ఆయన తెలిపారు. 

 హెచ్1బీ వీసాల్లో అధిక శాతం టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లే దక్కించుకుంటున్నాయని అమెరికా ప్రభుత్వం ఈ మధ్య ఆరోపించడం గమనార్హం. ఈ వీసాలను లాటరీ పద్ధతిన జారీ చేస్తూ ఉండడంతో  పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేయడం ద్వారా సంస్థలు అధిక వీసాలను దక్కించుకోగలుగుతున్నాయని విమర్శించింది.