//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంజాబ్‌లో పెంపుడు జంతువులపై పన్ను!

Category : national

పెంపుడు జంతువుల మీద పన్ను విధిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు స్థానిక మీడియాలు కథనం ప్రచురించాయి. రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్ సిద్దూ నేతృత్వంలోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బ్రాండింగ్ కోడ్ పేరిట గుర్తింపు చిహ్నలను లేదా నంబర్లను వాటికి కేటాయించటంగానీ, అవసరమైతే జంతువుల్లో మైక్రో చిప్‌లను అమరుస్తామని ప్రభుత్వం ప్రకటించటం విశేషం.కుక్క, పిల్లి, గుర్రం, పంది, బర్రె, ఆవు, ఏనుగు, ఒంటె, గుర్రం.. ఇలా పెంచుకునే జంతువులన్నీ తాజా ఆదేశాల పరిధిలోకి వస్తాయి. కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు ఇది వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వలేదు.