//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇడ్లీ, దోశల తయారీపై తగ్గనున్న పన్ను భారం

Category : business

దక్షిణాదివారికి అత్యంత ప్రియమైన అల్పాహారం ఇడ్లీ, దోశల తయారీపై పన్ను భారం త్వరలో తగ్గనుంది. వంటింట్లో వాడే గ్యాస్ లైటర్, దేవుని పూజలో ఉపయోగించే ధూప్ స్టిక్స్‌పైనా జీఎస్టీ తగ్గవచ్చు. రోజువారీగా ఉపయోగించే రెండు డజన్లకు పైగా ఉత్పత్తులపై పన్నురేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ యోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

తరచుగా ఉపయోగించే వస్తువుల్లో కొన్నింటిపై జీఎస్టీ నిర్ధారణలో క్రమరాహిత్యాలను గుర్తించిన జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ వాటిపై పన్ను భారం తగ్గించాలని ప్రతిపాదించిందట. అందులో కొన్నింటిపై ఈనెల 5న జరిగిన జీఎస్టీ మండలి సమీక్ష సమావేశంలో పన్ను భారాన్ని తగ్గించారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో జరుగనున్న సమావేశంలో మిగతా ఉత్పత్తులపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

బియ్యంతోపాటు పలు నాన్ బ్రాండెడ్ ఆహార పదార్థాలకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. దాంతో చాలామంది వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు ఈ ఉత్పత్తుల బ్రాండ్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకుంటున్నారు. వీటిని అడ్డుకునేందుకు జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీ ఓ ప్రతిపాదన చేసింది.

మే 15 వరకు ఉన్న బ్రాండ్ రిజిస్ట్రేషన్ల వివరాల ఆధారంగా ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అంటే, ఏదైనా వ్యాపార సంస్థ మే 15 తర్వాత బ్రాండ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నావారు విక్రయించే ఆహారోత్పత్తులపై జీఎస్టీ వర్తించనుందన్నమాట. ఈ విషయంపై వచ్చేనెల తొమ్మిదిన నిర్వహించనున్న సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.