టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్ర శేఖరన్, తమ గ్రూప్ లో లాభ సాటిగా లేని సంస్థల పై దృష్టి సారించి టాటా టెలి సర్వీసెస్ ని మూసివేత దిశగా తీసికెళుతున్నట్లు సంకేతాలు పంపించారు. అధిక అప్పులు, ఎక్కువ పోటీ వున్నా టెలి సర్వీసెస్ రంగం నుంచి దాదాపుగా తప్పుకుంటున్నట్టు , సంస్థ తన ఖాతా దారులకు, వీరిని వేరే సర్వీసెస్ కి మారమని సూచించి నట్లు తెలుస్తుంది.
దాదాపు ప్రతి కంపెనీ, భారతి ఎయిర్టెల్ మినహాయించి, అన్ని రిలయన్స్ జియో ప్రవేశం తరువాత నష్టాల బాటలో కి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా టెలి సర్వీసెస్ మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం.