టెలికం రంగంలో పోటీని తట్టుకోలేక ప్రముఖ టాటా టెలిసర్వీస్ కంపెనీలో పనిచేస్తున్న 500-600 మంది ఉద్యోగులను తొలగించింది. టెలికం రంగంలోకి ఇతర కంపెనీలు రావడంతో లాభాలు తగ్గుముఖం పట్టాయి. ఆ ప్రభావమే టాటా టెలీసర్వీస్పై పడటంతో ఉద్యోగులను తొలగించినట్లు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు వెల్లడించారు. తొలగించిన ఉద్యోగుల కోసం సెవరెన్స్ ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగులను తొలగించడం సేల్స్, ఇతర వర్గాలపై పడే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఇప్పటి వరకు టాటా టెలీసర్వీస్ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ప్రస్తుత పరిస్థితులు టాటా టెలీసర్వీస్కు పెను సవాలుగా మారాయి. ఈ పోటీ మార్కెట్లో సవాళ్లని అధిగమించాలంటే సరైన ప్రణాళికలు ఉండాలని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ట్రాయ్ సమాచారం ప్రకారం ఫిబ్రవరి 28, 2017 నాటికి టాటా మొబైల్ సబ్స్రైబర్స్ 51.2 మిలియన్ల మంది ఉన్నారు.