టాటా కమ్యూనికేషన్స్ బోర్డు కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం రేణుకా రామనాథ్‌ను ఎంపికయ్యారు.
మార్చితో 30తో స్వతంత్ర డైరెక్టర్‌గా పదవీకాలం ముగిసిన సుబోధ్ భార్గవా స్థానాన్ని రేణుకా భర్తీ చేయనున్నారు. 2014 డిసెంబరు నుంచి టాటా కమ్యూనికేషన్స్ స్వతంత్ర డైరెక్టర్‌గా రేణుకా వ్యవహరిస్తున్నారు. 2009లో పలు ప్రైవేట్ ఈక్విటీ ప్లాట్‌ఫామ్‌లను ఈమె ప్రారంభించారు. టాటా కమ్యూనికేషన్స్ బోర్డు బాధ్యతలు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. టెక్నాలజీ కీలకంగా మారిన ఇటువంటి సమయంలో వ్యాపారాల స్వరూపాలు పూర్తిగా మారుతున్నాయి. కంపెనీకి మంచి విలువలు, నియమాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా కమ్యూనికేషన్స్ వృద్ధి బాటలో నడుస్తోంది. బోర్డు, మేనేజ్మెంట్ బృందం కలిసి వాటాదార్లకు అదనపు విలువ చేకూరుస్తాను అని రేణుకా అన్నారు.