//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోదావరి జిల్లాలను టార్గెట్ చేసిన జగన్

Category : state editorial

విపక్ష నేత జగన్ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసారా..? బలమైన నేతలకు టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వివరాల్లోకి వెళితే గత ఎన్నికల్లో తెలుగుదేశ౦ పార్టీకి ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి భారిగా సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ రెండు జిల్లాలలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది.

జగన్ అధికారంకి దూరమవ్వడానికి కూడా ఇదే కారణం. ఇప్పుడు దాని పైనే దృష్టి సారించారు. ఇప్పుడు జగన్ యాత్ర కృష్ణా జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి క్రమంగా గోదావరి జిల్లాలకు చేరుకుంటుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది పడుతున్న నేతలను టార్గెట్ చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో సీటు రాని నేతలు సహా..ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ మేరకు ఇప్పటికే కొందరు నేతల వివరాలు కూడా జగన్ తెప్పించుకున్నట్టు సమాచారం. వారికి ఆదరణ ఎలా ఉంది తదితర వివరాలను జగన్ సేకరించారట. అలాగే కాపు ఉద్యమం సమయంలో తెలుగుదేశం పార్టీకి సహకరించని నేతలు కూడా ఆయన పిలుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు బలహీనంగా ఉన్న ఆ పార్టీ నేతలను కూడా పక్కన పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఎలా ఉన్నా జగన్ యాత్ర ఇప్పుడు ఆశావాహుల్లో ఆశల్లో నీళ్ళు పోయగా కొత్త వారికి ఊపునిస్తుంది.