//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ లుక్ పై క్లారిటీ ఇచ్చిన స్టీవెన్స్

Category : movies

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా భారీ మల్టీ స్టార్రర్ తెరకెక్కిస్తున్న సంగతే తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలునటిస్తున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయ్.

ఇప్పటికే భారీ యాక్షన్ షెడ్యూల్ ను అల్యూమినియం ఫ్యాక్టరీ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కి సంబంధించిన ఏ చిన్న విషయం బైటికి వచ్చిన అది నిముషాల్లో వైరల్గా మారుతుందు. ఇటీవలి ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక లుక్ బాగా వైరల్ అయ్యింది. అందులో ఎన్టీఆర్ 100 కేజీల భారీ దేహంతో కనిపిస్తున్నాడు.దేంతో ఎన్టీఆర్ ఒక వీరయోధుడి పాత్రలో వీర భయంకరుడిగా కనిపించబోతున్నాడని ఎన్నో ఊహాగానాలు చెక్కర్లు కొట్టాయి.

అయితే తాజాగా ఈ ఫోటో ఎప్పటిది కాదు అంటూ ఉహాగానాలని పటాపంచలు చేసాడు ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ స్టీవెన్స్. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను పోస్ట్ చేసి "గైస్.. ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతున్న తారక్ ఫోటోలు ఏడాది కిందటివి.. ఇది ప్రస్తుతం తారక్ లుక్ కాదు" అంటూ ట్వీట్ చేశాడు. అలా అని ఎన్టీఆర్ ఈ సినిమాలో హెవీ గా కనిపిస్తాడా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా దర్శన ఇవ్వబోతున్నాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.