//single page style gallary page

tanu Sri Datta fires on nana patekhar

Category : movies

Click here to read this article in Telugu

నానా పటేకర్ పై మరో మారు విరుచుకుపడ్డ.... తను శ్రీ దత్త

కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ సెట్స్‌లో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు నటి తనుశ్రీ దత్తా గత ఏడాది సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. తనుశ్రీ దత్త ‘మీటూ’ ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తనుశ్రీ దత్తపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ నిర్ధారించకపోవడంతో...నానా పటేకర్‌కు ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు గురువారం బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలపై తనుశ్రీ దత్త తీవ్రంగా స్పందించారు.

ముంబై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, నానా పటేకర్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారన్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. నానా పటేకర్‌కు క్లీన్ చిట్ ఇస్తూ ముంబై పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని తనుశ్రీ దత్త ఓ ప్రకటనలో స్పష్టంచేశారు.నానా పటేకర్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఆయన పబ్లిక్ రిలేషన్స్ టీమ్ మీడియాకు అవాస్తవ సమాచారం ఇస్తోందని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నానా పటేకర్‌కు సినీ పరిశ్రమలో ఆఫర్లు దక్కడం లేదన్నారు. దీంతో నష్టాన్ని భర్తీ చేసుకుని ఇమేజ్ పెంచుకునేందుకు ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని తనుశ్రీ దత్త చెప్పారు.

Actress Tanushree Dutta has been accused of sexually harassing her in Bollywood actor Nana Patekar a few years back. The Mumbai police are investigating the allegations against Tanushree Dutt 'Meethu'. The Bollywood media has been quoted as saying that Mumbai police have given clean chit to Nana Patekar because no eyewitnesses have allegedly committed sexual abuse against Tanushree Dutt. Tanushree Datta responded to these stories.

There is no truth in the articles that Mumbai police investigations are still underway and Nana Patekar's clean chit to police. Thanushree Datta said in a statement that the Mumbai police had not released any clear statement to Nana Patel. Nana Patekar, accused in the sexual assault case, has not received offers in the film industry. Thanushree Datta said that such rumors are being created to replace the damage and increase the image.