//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్...దీప్తిని సేవ్ చేసి ఎలిమినేషన్ లోకి వెళ్లిన తనీష్...!

Category : movies

బిగ్ బాస్ హౌస్ లో 58 వ రోజు బోనాల పండుగ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ సభ్యులకు ఇంటిని అందంగా పూలతో అలంకరించడం , మంచి వంట వాడుకొని , అందరు సంప్రదాయబద్దంగా ఉండాలని సూచించాడు. బిగ్ బాస్ చెప్పినట్లే అందరు కూడా ఎంతో అందంగా బిగ్ బాస్ హౌస్ ను అలంకరించారు.

ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.గార్డెన్ ఏరియాలో ఉన్న టెంట్లోకి ఎవరు చివరికి చేరుకుంటారో వారి నామినేషన్ అయినట్టు బిగ్ బాస్ తెలిపాడు. పూజా రామచంద్రన్ కెప్టెన్‌గా ఉండడం, ఇటీవల కమల్ హాసన్ ఇంట్లోకి వచ్చినప్పుడు అమిత్‌కి సేవ్ కార్డ్ ఇవ్వడంతో ఈ ఇద్దరు టాస్క్‌కి మినహాయింపుగా ఉన్నారు. మొత్తం ఆరు రౌండ్ లలో సభ్యులు టెంట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో రౌండ్ లో ఎవరైతే చివర్లో ఉంటారో వారు నామినేషన్ లో ఉన్నట్లు.

మొదటి రౌండ్ లో బాబు గోగినేని చివరికి టెంట్‌లోకి వెళ్లడం తో ఆయన మొదటి నామినేషన్‌లో నిలిచారు. రెండోసారి గీతా , మూడోసారి గణేష్‌, నాలుగోసారి శ్యామల నిలిచారు. ఇక ఐదోసారి మాత్రం దీప్తి సునయన కోసం తనీష్ వెనుకడుగు వేసి నామినేషన్‌లో ఐదో వ్యక్తిగా ఉన్నాడు.