//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నోరు జారిన తాండూరు ఎమ్మెల్యే ... రీజన్ ఇదే

Category : state politics

ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఇంకా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయకపోవటం ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే కు ఇబ్బంది కలిగించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారమే చెయ్యకుండా ఎలా హాజరయ్యారని టీఆర్ ఎస్ నాయకులు వ్యతిరేకించారు. దీంతో ఆయన ఒక ఎమ్మెల్యేను అన్న విషయం మరచి పోయి మరీ రెచ్చిపోయారు.

తనను తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హజరుకాకుండా అడ్డుపడటాన్ని తీవ్ర అవమానంగా భావించినఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఆవేశంలో నోరు జారారు. ఏ పిచ్చి నాకొడుకులు నేను రావద్దు అని చెప్పారంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నూతన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే రాకను టీఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయకుండా రోహిత్‌ రెడ్డి మున్సిపల్‌ సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే తీరును తప్పుబడుతూ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సైతం ఏ మాత్రం తగ్గకుండా ఫైర్ అయ్యారు. మున్సిపల్‌ కమిషనర్‌కు సైతం ఎమ్మెల్యే క్లాస్ పీకారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నాన్సెన్స్ క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. అయితే అంతకుముందు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కౌన్సిలర్లు సన్మానం కూడా చేశారు. అంతలోనే ఈ మాట అన్నారని ఆయన దృష్టికి రావటంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కానిచ్చి ఉంటె ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు .ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇలా నోరు జారే వారు కాదేమో...

Related News