//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శోకసంద్రంలో చెన్నై.... మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయం......!

Category : state politics

కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి..ఈ పేరుకి తమిళనాడులో విపరీతమైన అభిమానులున్నారు. ఎం.కెగా మరియు డా.కళైనార్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు జూన్ 3, 1924 న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలై ఆయన స్వస్థలం ఆయన తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .

1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు మరియు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి కరుణానిధిగారు రికార్డు సృష్టించాడు.

తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా ప్రారంభించాడు.

ప్రస్తుతం అయన కుమారుడు స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అయన వయసు 94 సంవత్సరాలు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో విల్ చైర్ కే పరిమితమయ్యాడు. కానీ ఈ మధ్య మూత్ర నాళాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుమారులు చెన్నై లోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేసారు.

మొదట్లో కోలుకుంటున్నట్టు చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం తరువాత కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉంది అని చెప్పుకొచ్చారు. తరువాత కాసేపటికే అయన మరణించాడని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. దీనితో చెన్నై నగరం మొత్తం అభిమానుల ఆర్తనాదాలతో హోరెత్తిపోతుంది. పోలీస్ అధికారులందరూ చెన్నైకి రావాల్సిందిగా చెన్నై డీజీపీ ఆదేశాలు జారీ చేశారు

Related News