//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రజనీకాంత్ రాకతో తమిళ నాయకుల జాతకాలు తారుమారు !

Category : national politics

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి సంకేతం ఇవ్వడంతో తమిళనాడు రాజకీయాలలో కదలిక ప్రారంభమైనది. ఆయన సొంతంగా పార్టీ పెడతారా, బిజెపి తో చేతులుకలుపుతారా అనే సందిగ్థత ఒక వైపు కోనసాగుతుండగా ఆయన రాజకీయ ప్రవేశం చేస్తే ప్రస్తుతం తమిళ్ నాడులో ఆధిపత్యం కోసం పోరాడుతున్న రాజకీయ నాయకుల జాతకాలు మాత్రం తారుమారు కావడం తధ్యం అని పలువురు భావిస్తున్నారు. 

తలైవా రాజకీయ ప్రవేశంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, ఏఐఏడీంకేలోని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ముఖ్యమంత్రి పళనిస్వామి వంటి నాయకుల తమ జాతకాలు తారుమారయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. అందుకనే వేగంగా అడుగులు వేస్తున్నారు. 

ఇప్పటికే తనను మంచి మిత్రుడుగా పేర్కొన్న రజనీకాంత్ కు బిజెపి తో మాత్రం చేతులు కలపవద్దని హెచ్చరించిన స్టాలిన్ మహా రాజకీయ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి యం కె కరుణానిధి 94వ జయంతి సందర్భంగా చెన్నై లో పెద్ద ఎత్తున చేస్తున్న సంబరాలకు బీజేపీయేతర పక్షాల జాతీయ నాయకులను ఆహ్వానించారు.  

రాష్ట్రంలో బలమైన రాజకీయ కూటమిగా ఆవిర్భవించి ప్రయత్నం స్టాలిన్ చేస్తున్నారు. నెలరోజులకు పైగా ఏఐఏడీంకే లోని రెండు వర్గాలను కలపడం కోసం బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అయితే రజనీకాంత్ రంగంలోకి రావడంతో ఇప్పుడు ఈ పార్టీ నాయకులు తొందర పడుతున్నారు. 

గత వారం ప్రధాని నరేంద్ర మోడీని కలసిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపితో పొత్తుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సంసిద్ధతను వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే తర్వాత ఆ ప్రకటనను మార్చుకున్నారు అనుకోండి. ఈ రోజు ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానిని కలుస్తున్నారు. విలీనం కాని పక్షంలో తమ రాజకీయ మనుగడ ప్రమాదంలో పడుతుందని వీరు ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నది.