//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమిళం అర్జున్ రెడ్డి టీజర్ విడుదల!

Category : movies

పక్కా బోల్డ్ కంటెంట్ తో లవ్అం డ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి ఈ సినిమా టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసిన సంగతి అందరకి తెలిసిందే. దీంతో ఈ సినిమాను హిందీ, తమిళంలో రిమేక్ చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. తాజాగా తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను ‘వర్మ’ టైటిల్ తో తమిళ్ క్రియేటివ్ దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డు విజేత మురుగన్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక వర్మలో హీరోయిన్ గా మేఘా నటిస్తోంది. తాజాగా ధ్రువ్ పుట్టినరోజు నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ ను మీరూ చూసేయండి.