//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Tamannaah Bhatia Movies : తమన్నా భాటియా సినిమాలు : Hot Actress Tamanaa Bhatia photos family images videos marriage galleries caste bio data

Category : editorial

తమన్నా భాటియా తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమల్లో నటించే ఓ భారతీయ నటి, మోడల్, నృత్యకారిణి. 1989 డిసెంబరు 21 న ముంబైలో జన్మించింది.తమన్నాది సింధీ కుటుంబం. తన తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజిని భాటియా. తన అన్నయ్య ఆనంద్ భాటియా మెడిసిన్ చదివాడు.

చిన్నప్పట్నుంచి హీరోయిన్‌ కావాలనే తమన్నాకి ఉండేది. తన తల్లిదండ్రులు తననెప్పుడూ నిరుత్సాహపరచలేదు. దాంతో 13వ ఏటే సినీరంగ ప్రవేశం చేసింది తమన్నా. నటనపై తనకు గల ఆసక్తిని గమనించి తన తల్లిదండ్రులు తన పదో ఏటే తనను థియేటర్‌ ఆర్ట్స్‌లో చేర్పించారు. అలాగే డాన్సంటే తమన్నాకు చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. అందుకే డాన్స్‌కు సంబంధించి ట్రైనింగ్‌ కూడా తీసుకుంది.

తమన్నా 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అదే ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, 2006లో కేడీతో తమిళంలోకి అడుగుపెట్టింది. మూడూ విఫలమైనా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తమన్నా కెరియని పీక్ స్టేజి కి తీసుపోయింది, బాలాజీ శక్తివేల్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ సినిమా కళ్ళూరి తమన్నాకి తమిళ్ సినీ ఇండస్ట్రీ లో సరైన గుర్తింపును ఇచ్చాయి.

ఆయన్ , కండేన్ కాదలై , పయ్యా , సిరుతై , వీరం వంటి సినిమాల ద్వారా తమిళ్ సినీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, సుకుమార్ దర్శకత్వంలో 100% లవ్ సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సాధించిన తమన్నా ఆపై ఊసరవెల్లి , రచ్చ , కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

ఆ తరువాత చాల వరకు తెలుగు సినిమాల్లో నే నటించి తెలుగు సినీ ఇండస్ట్రీ లో టాప్ హీరోహిన్ గా కొనసాగింది.తరువాత హిమ్మత్‍వాలా చిత్రం ద్వారా తిరిగి హిందీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా విఫలమైనా తమన్నాకి మరెన్నో హిందీ సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.

2011లో తమిళనాడు ప్రభుత్వం తమన్నాని కలైమామణి పురస్కారంతో సత్కరించింది.తమన్నా బహుబాలి లో చేసిన అవంతిక పాత్రకు విమర్శకులు అభినందించారు.

నేటివరకూ తమన్నా దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డుకి 3 నామినేషన్లు, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటి అవార్డుకి 3 నామినేషన్లు సంపాదించి మొత్తమ్మీద 17 అవార్డ్ నామినేషన్లు అందుకోగా అందులో 5 అవార్డులను గెలుచుకుంది.తమన్నా నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ప్రఖ్యాతి గాంచింది.