//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిరంజీవి సరసన తమన్నా.. ఇక అబీబీ .....అబీబీ...!

Category : movies

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరిసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి.

కొణిదల ప్రొడక్షన్ బ్యానేర్ పై రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్యం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే..

అయితే చిత్రంలో చిరంజీవి సరసన మరో హీరోయిన్ చిందేస్తుందని ఫిలింనగర్ టాక్. అయితే తమన్నా ఈ చిత్రంలో చిరంజీవి కలిసి నటిస్తుందని తాజా సమాచారం.

బాహుబలి తరువాత తెలుగు లో తమన్నా కి ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ ఎప్పుడు ఈ అమ్మడి చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్యంలో వేంకటేష్ సరసన ఎఫ్ 2 మూవీ చేస్తుంది. అయితే తమన్నా, చిరంజీవి తో సమానంగా డాన్స్ చేయగలదని ఈ సినిమాలో తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదైతేనేమి చిరంజీవితో ఛాన్స్ కొట్టేయడంతో ఇక ఈమె కెరీర్ కి తిరుగులేదని ఫిలింనగర్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.