గార్డేజ్ఆగ్నేయ అఫ్ఘనిస్థాన్ నగరంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఫాక్తియా రాష్ట్ర రాజధాని గార్డేజ్లోని పోలీసు శిక్షణా కేంద్రం లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో 71 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో 170 మంది గాయపడ్డారు. పోలీసు శిక్షణ కేంద్రంపై ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన రెండు కారు బాంబులతో దాడి చేశారు.
మరికొందరు సాయుధులు తూటాల వర్షం కురిపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఇప్పటివరకు 71మంది చనిపోయారని, మృతుల్లో పోలీసులతోపాటు మహిళలు, విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. గార్డేజ్ దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ట్విట్టర్లో తెలిపింది.