//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిబంధనలను పాటించని తలసాని ఫ్లెక్సీల తొలగింపు ... 25 వేల ఫైన్

Category : politics state

హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. 25 వేల జరిమానా విధించి, ఆ ఫ్లెక్సీలను తొలగించింది. మార్చి 8న మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలోనూ జిహెచ్ఎంసి కఠిన నిర్ణయం తీసుకుంది.

గతంలో కేటీఆర్ సైతం సొంత పార్టీలోని కార్పొరేటర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. అలా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి జరిమానా విధించి రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా ఒకటే అని తేల్చి చెప్పారు. ఇక తాజాగా తలసాని విషయంలోనూ జిహెచ్ఎంసి అధికారులు దాన్నే ఫాలో అయ్యారు.

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై కట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిచినందుకు ఆయన అనుచరులకు 25 వేల రూపాయల ఫైన్ పడింది.

Related News