టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టిఎఎల్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ రెండు కొత్త రోబోలను మార్కెట్లో విడుదల చేసింది.బ్రాబోగా నామకరణం చేసిన ఈ రోబోల వల్ల 30 శాతం వరకు ఉత్పాదకతను పెంచుకోవచ్చని కంపెనీ చెబుతోంది.రెండు కిలోల నుంచి పది కిలోల మధ్య పేలోడ్ సామర్థ్యం గల వీటి ధర 5 నుంచి 7 లక్షల రూపాయల మధ్యన ఉంది.ధరల విషయానికొస్తే.. ఇవి 30-40 శాతం మేర తక్కువగా ఉంటున్నాయని.. అయినప్పటికీ బ్రాబోలకు నేరుగా ఎటువంటి పోటీ లేదని టీఏఎల్ ఛైర్మన్ ఆర్.ఎస్. ఠాకూర్ పేర్కొన్నారు.ఇప్పటికే 25 బ్రాబోలను విక్రయించాం. ప్రయోగాత్మకంగా 30 రోబోలను వినియోగిస్తున్నాం. వస్తువులను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం, విడిభాగాల అసెంబ్లింగ్, మెషీన్ అండ్ ప్రెస్ విభాగాల్లో ఈ బ్రాబోలను వినియోగించవచ్చునని కంపెనీ చైర్మన్ ఆర్ఎస్ ఠాకూర్ అన్నారు.మధ్యతరహా సంస్థలు, భారీ పరిశ్రమల్లో తయారీ విభాగంలో ఇవి ఉపయోగపడతాయి అని పేర్కొన్నారు.