//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ పార్లమెంటరీ బోర్డు కీలక నిర్ణయాలు..!

Category : politics

ఈ రోజు ఉదయం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, ఆరుగురు మంత్రులు హాజరయ్యారు.

మన రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయస్థాయి లో పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగం గా దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాసి వారి నుడి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు.

ఏపీ విభజనచట్టం లో వున్న హామీలు,కేంద్రం నుండి ఎప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయి అన్నదాని ఒక లేఖ రూపం లో విడుదల చేయాలనీ అనుకున్నారు. ప్రజలు, పార్టీ లీడర్స్ మాటలను పరిగణ లోనికి తీసుకోని మంచి నిర్ణయం తీసుకోవాలని ఎంపీ లు సీఎం తో చెప్పారని సమాచారం. ఈ నెల 5 నుండి జరిగే పార్లమెంట్‌ సమావేశాలలో మళ్లీ పోరాటం వృధ్రుతం చేయాలనీ టీడీపీ పార్లమెంటరీ బోర్డు కీలక మైన నిర్ణయం తీసుకున్నారు.

Related News