//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'tasksche.exe' ఫైల్స్ పేరుతో వానాక్రై ఈమొయిల్స్

Category : world technology

ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది వానాక్రై ర్యాన్సమ్ మాల్ వేర్. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా సుమారు 150 దేశాలకు పైనే ఈ మాల్ వైరస్ బారిన పడ్డాయి. ఈ భారీ సైబర్ దాడిని ఎదుర్కొనేందుకు పలు దేశాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవటం షురూ చేశాయి. ఈ వైరస్ దాడి నుంచి తప్పించుకోవటానికి రెడ్ కాలర్డ్ క్రిటికల్ అలర్ట్ జారీ చేశాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 75 వేల కంప్యూటర్లను హ్యాక్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ మాల్ వేర్ బారిన పడకుండా ఉండటం ఎలా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిపుణుల సూచన ప్రకారం ''tasksche.exe'' వచ్చే ఎలాంటి ఈమొయిల్ అటాచ్ మెంట్ ను తెరవొద్దని చెబుతున్నారు.

అంతేకాదు '.exe' ఎక్స్ టెన్షన్ తో వచ్చే ఏ ఫైల్ను కూడా తెరవకుండా ఉండటం ఉత్తమమని చెబుతున్నారు. ఈ ఫైల్స్ ఓఎస్ ఫైల్స్ ను అలెర్ట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన ర్యాన్సమ్ వేర్ దాడికి పాల్పడే వైరస్ కావటమే కాదు ఆ మాల్ వేర్ కంప్యూటర్ లోకి జొరబడి, బాధితుల నుంచి డేటా తీసుకెళుతుందని ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమన్న సూచన సైబర్ నిపుణులు చేస్తున్నారు. ఈ సైబర్ దాడికి అమెరికా ప్రభుత్వమే కారణమని ప్రఖ్యాత టెక్ దిగ్గజం మెక్రోసాఫ్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్ అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిందేనని. దీన్ని ఏప్రిల్ లో ఆన్ లైన్ లో లీక్ చేసినట్లుగా మైక్రోసాఫ్ట్ అధినేత బ్రాడ్ స్మిత్ పేర్కొనటం విశేషం. పరిశోధకులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.