ప్రేమకు చిహ్నం అంటే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్ మహల్.ప్రపంచ సుందర నిర్మాణాల్లో ఒక్కటైన తాజ్ మహల్ విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.చరిత్ర ప్రకారం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృతి చిహ్నంగా తాజ్ ను నిర్మించారనేది మనకు తెలిసిన విషయమే.అయితే,వాస్తవానికి ఇది ఒక శివాలయమని,ఆలయంపైన దీన్ని నిర్మించారంటూ కొందరు వాదిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని,శివాలయం కాదని పురావస్తు శాఖ స్పష్టం చేసింది.ఈ మేరకు ఆగ్రా కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.తన భార్య స్మృతి చిహ్నంగా షాజహాన్ నిర్మించిన ప్రేమమందిరం ఈ నిర్మాణమంటూ పురావస్తు శాఖ తరపు న్యాయవాది అంజనీ శర్మ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
తాజ్ అనేది సమాధి కాదని తేజోమహాలయ్ పేరుతో ఉన్న శివాలయమని కొందరు చేస్తున్న వాదనలు ఊహాతీతమని అన్నారు.ఒక చరిత్ర స్థాయిలో తాజ్ మహల్ కు గొప్ప పేరు ఉందని దాని పేరును మార్చడమనేది సాంస్కృతిక చరిత్రను కాలరాయడమవుతుందని పేర్కొన్నారు.తేజోమహాలయ్ అనే పేరుతో ఉన్న శివాలయం కాదు.