Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాప్సి 'లవ్'లో పడినప్పుడు వయసు తెలిస్తే అవాక్కైపోతారు...

Category : movies

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ 'తాప్సి'. తెలుగు తమిళ్ భాషల్లో మంచి అవకాశాలు వచ్చి ప్రస్తుతం తగ్గిన బాలీవుడ్ లో ఆమె చేసిన కొన్ని సినిమాలకే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్నీ మాట్లాడింది. స్కూల్ డేస్ లో ఆమె లవ్ లో పడినపుడు, ఆమె తొమ్మిదో తరగతి చదువుతుంది అని ఆమె క్లాస్ అబ్బాయితోనే ప్రేమలో పడినట్టు చెప్పింది.

ఆమె నవ్వుతు తన స్నేహితులతో పోలిస్తే తన ఫస్ట్ లవ్ ఆలస్యమైందని, పదోవ తరగతికి వచ్చాక ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాలంటే తన బాయ్ ఫ్రెండ్ ఆమెని వదిలేసాడు అని, ఆలా ఆమె లవ్ రిలేషన్ దెబ్బతినడం తట్టుకోలేకపోయిందని. అప్పట్లో సెల్ ఫోన్స్ లేకపోవడంతో, కాయిన్ బాక్స్ నుంచి అబ్బాయికి ఫోన్ చేసి ఏడ్చింది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అవి అన్ని తలుచుకుంటే చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్పింది.

Related News