//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ రెడ్డి పోటీ ఆ స్థానం నుండే ... కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలిజాబితా ఇదే

Category : politics state

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రచార పర్వం నిర్వహిస్తుంటే , కాంగ్రెస్ సైతం దూకుడు పెంచనుంది. అందులో భాగంగా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించిన కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రేవంత్ రెడ్డి కి స్థానం దక్కింది.

మొత్తం 17 లోక్ సభ సీట్లుంటే... వాటిలో హైదరాబాద్ సీటును మజ్లిస్ కు వదిలేసి మిగిలిన 16 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా అధికార టీఆర్ ఎస్ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రచార హోరును కూడా ఓ రేంజిలో మోగిస్తోంది. అయితే గడచిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన టీ కాంగ్రెస్ కనీసం లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావించి తొలి జాబితా కింద ఓ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను విడుదల చేసిన టీ కాంగ్రెస్... మిగిలిన 9 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ జాబితా ప్రకారం ఇప్పటిదాకా అభ్యర్థులు ఖరారైన స్థానాలు ఏమిటంటే... ఆదిలాబాద్ - మహబూబాబాద్ - పెద్దపల్లి - కరీంనగర్ - మల్కాజిగిరి - జహీరాబాద్ - చేవెళ్ల - మెదక్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ జాబితాలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. . ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్...

టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. లోక్ సభ బరికి సంబంధించి గతంలో టీడీపీకి మంచి పట్టున్న మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు రేవంత్ . ఇక కాంగ్రెస్ ప్రకటించిన జాబితా విషయానికి వస్తే మల్కాజ్ గిరి.... రేవంత్ రెడ్డి,ఆదిలాబాద్... రమేశ్ రాథోడ్,మహబూబాబాద్... బలరాం నాయక్,పెద్దపల్లి.. ఏ చంద్రశేఖర్, కరీంనగర్... పొన్నం ప్రభాకర్, జహీరాబాద్... మదన్ రావు, చేవెళ్ల... కొండా విశ్వేశ్వరరెడ్డి, మెదక్... గాలి అనిల్ కుమార్ లకు అవకాశం కల్పించింది.