12 నగరాల్లో సిరియా సైన్యానికి, ఐసిస్ టెర్రరిస్టులకు వార్ జరిగింది,వీరి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు.మరణించిన వారిలో 17 మంది సైనికులు కాగా 32 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు.అసలు ఏమి జరిగింది...ఐదు రోజుల క్రితం అలెప్పో సమీపంలోని ఓ ఆర్మీ స్థావరాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.దీనిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ అనుకూల దళాలు రంగంలోకి దిగాయి.ఆర్మీ స్థావరాన్ని దక్కించుకునే క్రమంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు.