//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మెగా స్టార్ చిరు తో ...మెగా పవర్ స్టార్ ఇంటర్వ్యూ ....ఎందుకో తెలుసా ...?

Category : movies

మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కు తున్న చిత్రం 'సైరా ' నరసింహారెడ్డి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా కు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తుంది.'సైరా ' విడుదలకు చాలా టైం ఉన్నప్పటికీ ..... ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం లేదు.

కానీ యూనిట్ మాత్రం హడావుడిగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. చిరంజీవిని కూర్చోబెట్టి ఓ ఇంటర్వ్యూ వదలాలని భావిస్తున్నారు. సైరా మేకింగ్, సినిమా అప్ డేట్స్, బడ్జెట్, స్టోరీలైన్.. ఇలా అన్నీ కవర్ అయ్యేలా ఆ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ .ఇలా చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది.నిజానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం చాల రోజులుగా ఛానెళ్లతో చర్చలు జరుగు తున్నాయి. పేరుకు ఇది మెగాస్టార్ సినిమానే అయినప్పటికీ చరణ్ అడుగుతున్న కోట్లు ఇవ్వడానికి ఛానెళ్లు ముందుకురావడం లేదు. అటు ఓవర్సీస్, డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా ఇలాంటి ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి.

అందుకే మూవీకి మార్కెట్ పరంగా మరింత హైప్ ఇచ్చేందుకు ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట.ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవిని ఇంటర్వ్యూ చేసేది టీవీ యాంకర్ కాదు. స్వయంగా మెగా స్టార్ తనయుడు , సైరా నిర్మాత రామ్ చరణ్....చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తాడట. ఈ స్పెషల్ ఇంటర్వ్యూను అతిత్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని సైరా యూనిట్ భావిస్తోంది.ఈ టైం లో షూటింగ్ మానేసి ,ఇంటర్వ్యూ ఏంటి అని అనుకుంటున్నారా ...అసలు దీనివెనక సినిమా ప్రచారం కంటే, మార్కెట్ వ్యూహమే ఎక్కువగా కనిపిస్తోంది.

అవును.. సైరా బిజినెస్ ను ఇంకాస్త పెంచేందుకు ఇలా చిరంజీవితో వ్యూహాత్మకంగా ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు రామ్ చరణ్.. ఈ ఇంటర్వ్యూ తర్వాత మరోసారి ఫ్రెష్ గా బిజినెస్ డీల్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.ఎలాగూ మార్కెట్ లో మెగాస్టార్ కి ఉన్న మార్కెట్ కి తోడు మెగాపవర్ స్టార్ మార్కెట్ కూడా యాడ్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారు.దీని ద్వారా మంచి రేటుకే 'సైరా' అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.