Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రభాస్ " సాహో " ని ఢీ-కొట్టబోతున్న టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరు,నాగ్..!

Category : movies

బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత యంగ్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమా కోసం అటూ ప్రభాస్ అభిమానులతో పాటు టోటల్ ఇండియన్ సినిమా ప్రేక్షకలు సైతం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ సైన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ జంటగా శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే.మరో ముఖ్య పాత్రల్లో మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ వంటి వారు నటిస్తున్నారు.అయితే ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘మన్మథుడు-2’ సినిమాను కూడా ఇదే ఆగస్టులో విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకుని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు ఈ చిత్ర యూనిట్.

కానీ, ‘సాహో’ వస్తోన్న సమయంలోనే ‘మన్మథుడు-2’ నీ కూడా విడుదల చేయడానికి నాగార్జున సుముఖంగా లేరని తెలుస్తోంది. అంత పెద్ద సినిమాను ఢీ-కొట్టేకన్నా దాని కన్నా ముందు గాని వెనుక గాని తాను నటించనున్న ‘మన్మథుడు- 2’ను విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా సేఫ్‌గా ఉండవచ్చని నాగార్జున భావిస్తున్నారట. ప్రస్తుతం ఇదే వార్త ఫిల్మ్ నగర్‌లో తెగ వినిపిస్తోంది.ప్రస్తుతం పోర్చుగల్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని నాగ్ చూస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను జూలైలో విడుదల చేసేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. ఇలా అయితే, ‘సాహో’ను ఢీ-కొట్టే అవసరం ఉండ బోధని నాగార్జున అభిప్రాయమట. మరోవైపు చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ కూడా ఆగస్టులోనే రిలీజ్ కి సిద్దం చేస్తూ ఉండబోతున్నట్టు కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ రకమైన నిర్ణయం మూలాన అటూ సైరా కి ఇటు సాహో సినిమాకి సైతం భారీ దెబ్బ పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ మరో మారు పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మన్మథుడు-2’లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ..... ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ‘RX 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.చూడాలి మరి ఏం సినిమా ఏం డేట్ కి ఖరారు కాబోతుంది అన్నది.

Related News