//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన 99 ఏళ్ళజార్జ్ ..!

Category : world

ఈ కాలంలో 60 ఏళ్లకే చాలా మంది వృధాప్యం దాల్చేస్తున్నారు. తమ పనులు తాము చేసుకోవడానికే కష్టమైపోతుంది. మరి 90 ఏళ్ళ వయసు వచ్చేసరికి చాలా మంది కాలం చెల్లించేస్తున్నారు. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ జార్జ్ కొరోనెస్ 99 ఏళ్ళ వయసులో రికార్డును బ్రేక్ చేస్తూ ఆశ్చర్యపరిచాడు. వచ్చే ఏప్రిల్‌తో 100వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నాడు.

ఈ వయసులోనూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తనకు దగ్గరగా ఉన్న వయసు వారితో క్వీన్స్‌లాండ్‌లో అధికారికంగా నిర్వహించిన 50మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు.

శుక్రవారం మెన్స్ మాస్టర్స్ కేటగిరీలో 100-104 ఏళ్ల మధ్యనున్న వారికోసం నిర్వహించిన పోటీలో జార్జ్ ఒక్కడే పాల్గొన్నాడు. 56.12 సెకన్లలో అతడు టార్గెట్‌ను చేరుకున్నాడు. 2014లో నిర్వహించిన టోర్నీలో జాన్ హ్యారిసన్ ఇదే కేటగిరీలో 1:31:19 నిమిషాల్లో రేస్‌ను పూర్తి చేశాడు. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకొని తాజాగా ఈ రికార్డును జార్జ్ బ్రేక్ చేశాడు.