//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.

Category : national

రైల్వే ప్రయాణికులకు తీపి కబురు తెలిపింది ఐర్‌సీటీసీ..ఇప్పటివరకు ఐర్‌సీటీసీలో తమ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకున్న ప్రయాణికులు ఒకే నెలలో ఆరు టికెట్స్ మాత్రమే బుక్ చేసుకొని సౌలభ్యం ఉండేది..కానీ ఇక నుండి ఆ సంఖ్య ను 12 కు పెంచింది ఐర్‌సీటీసీ. అక్టోబర్‌ 26 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

దీని ద్వారా తమ ఐఆర్‌సీటీసీ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపింది. అలాగే టికెట్‌ బుకింగ్‌ విషయంలో మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానాన్ని ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీలో జనరల్‌ కోటాలో ఒక టికెట్‌పై ఆరుగురు ప్రయాణించే వెసులుబాటు ఉంది. తత్కాల్‌ విషయంలో మాత్రం ఒక టికెట్‌పై నలుగురు ప్రయాణానికి అనుమతిస్తారు.