Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2017 స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో ఇండోర్‌ కు తొలిస్థానం

Category : national

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంక్ లను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం తొలి ర్యాంక్‌ సాధించగా, గత రెండు సర్వేల్లో తొలి ర్యాంక్‌ సాధించిన మైసూర్‌ ఈసారి ఐదో ర్యాంక్‌కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తిరుపతి నగరాలు టాప్‌-10లో స్థానం సాధించాయి.

టాప్‌-10 ర్యాంకులు:

1. ఇండోర్‌

2. భోపాల్‌

4. సూరత్‌

5. మైసూర్‌

6. తిరుచురాపల్లి

7. న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌

8. నవీ ముంబయి

9. తిరుపతి

10.వడోదర

టాప్‌-50లో గుజరాత్‌ నుంచి 12, మధ్యప్రదేశ్‌ నుంచి 11, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8 పట్టణాలు స్థానం సాధించాయి. ఈ మూడు రాష్ట్రాలు స్వచ్ఛభారత్‌లో గణనీయమైన ప్రగతి సాధించాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ నుండి రెండు పట్టణాలు మాత్రమే ర్యాంక్ సాధించాయి.కానీ గతేడాది తెలంగాణలోని నాలుగు పట్టణాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో ర్యాంకులు సాధించాయి.

Related News