Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"ఎన్టీఆర్ బయోపిక్" లో ఎస్విఆర్, మోహన్ బాబు వీరే...?

Category : movies

నట సార్యభౌమ, సర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్యం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన కళాకారులూ, రాజకీయా నాయకుల పాత్రలను కూడా ఉడేటట్లు చూసుకుంటున్నాడంట క్రిష్.

ఇప్పటికే సర్గీయ అక్కినేని నాగేశ్వరావు గారి పాత్రలో అయన మనమడు సుమంత్ నటిస్తుండగా, సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్రలో అయన తనయుడు మహేష్ బాబు నటిస్తున్నాడు. అదేవిధంగా మహానటి సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్, శ్రీదేవి పాత్రలో రకుల్, చంద్రబాబు నాయుడు గారి పాత్రలో దగ్గుపాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో ఎస్ వి రంగారావు గారి పాత్రలో నాగబాబు నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మహానటి మూవీలో ఎస్ వి ఆర్ పాత్రను మోహన్ బాబు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం నాగబాబు ని తీసుకోవటానికి కారణం ఎన్టీఆర్ కి మోహన్ బాబు కి ప్రేత్యేకమైన సంబంధం ఉంది.అందుకే ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రని అయనకె కేటాయించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.