ఈ సారి కూడా తన మార్క్ చాటు కొనున్నడం ఖాయం. అయితే ఈ సీజన్లో 7 మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వగా.... ప్రతి మ్యాచ్ లోనూ అభిమానుల సంఖ్య 30 వేలకు మించి ఉండడం ..... 38 వేల సామర్థ్యమున్న ఈ స్టేడియం కొన్ని మ్యాచ్‌లకు పూర్తిగా నిండిపోవడం కూడా చూశాం.. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్-12 ఫైనల్ టిక్కెట్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ప్లేఆఫ్ మ్యాచ్‌ల టిక్కెట్లు అందుబాటులో పెట్టిన ఐపీఎల్ నిర్వాహకులు.. ఫైనల్ మ్యాచ్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుందనే చడీచప్పుడు లేకుండా.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్ మ్యాచ్ టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఈ టికెట్స్ ను ఈవెంట్స్ .కామ్ సంస్థ ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది. ఒకరోజు ముందో లేదా .. కనీసం కొన్ని గంటల ముందో పత్రికలకు లేదా, టీవీ ఛానెళ్ల కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు . గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఈవెంట్స్‌నౌ.కామ్ వెబ్సైట్లో కొన్ని నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది.
కేవలం 1500, 2000, 2500, 5000 రూపాయల టిక్కెట్లు మాత్రమే అందుబాటులో పెట్టింది.మిగతా టిక్కెట్ల సంగతి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఐతే ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు....? ఎన్ని అమ్ముడయ్యాయి...? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు....? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు లేవు...! ఈ విషయంపై ఈవెంట్స్‌నౌ ప్రతినిధి సుధీర్‌ను.. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సీఈఓ పాండురంగ మూర్తిలను సంప్రదించినా ఫలితం లేకపోయింది. వీరిద్దరు ప్రస్తుతం అందుబాటులో కూడా లేరు. అటు హెచ్‌సీఏ స్పందించకపోవడంపై కూడా అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘సాధారణంగా మ్యాచ్ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ.
ఐపీఎల్ ఫైనల్ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐతే ఈవెంట్స్‌నౌ.కామ్ గానీ.. హెచ్‌సీఏ గానీ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్‌సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్‌నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. ఫైనల్‌కు ఆదరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మాలని ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని హెచ్‌సీఏలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యానించాడు. ‘‘కొన్ని నిమిషాల వ్యవధిలో 38 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉంది. నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు చూపించకుండా టిక్కెట్లు తీసుకోడానికి వీల్లేదు. ఎవరు ఏ సమయంలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు...? వారి గుర్తింపు కార్డు వివరాలు ఈవెంట్స్‌నౌ.కామ్ చూపిస్తుందా...?’’ అని హెచ్‌సీఏ క్లబ్ కార్యదర్శి ఒకరు ప్రశ్నించాడు.