//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పెళ్లి చేసుకున్నోళ్లకే పిల్లలుండాలా...హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Category : national

మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ కుటుంబ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటేనే పిల్లలు ఉండాలా అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. వివరాల్లోకి వెళితే సుస్మిత ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని వారిని కన్న తల్లి మాదిరి పెంచుతున్నారు.

అయితే ఆమె ఇప్పటి వరకు ఎవరిని వివాహం చేసుకోలేదు. అయితే సహజీవనం కూడా చేసారు. దీనిపై ఆమె ఎక్కడికి వెళ్ళినా మీడియా ప్రశ్నిస్తుంది. దీనిపై ఆమె స్పందించారు. “నేను ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నాను. చాలా మంది దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఓ కుటుంబం కావాలంటే రక్త సంబంధమే అవసరం లేదు. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుని వారి ఇంటి పేరును జత చేసుకుంటేనే కుటుంబం అవ్వదు. ఈ అభిప్రాయం మారాలి. దేశవ్యాప్తంగా 45 శాతం మంది అనాథలు అనాథాశ్రమాల్లో ఉండటం లేదు. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో ఆస్వాదిస్తేనే తెలుస్తుంద౦టు ఆమె చెప్పుకొచ్చారు.