//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీకాకుళంలో సూర్య భగవానుని అద్భుత దృశ్యం

Category : national state

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి. ఈ రోజు ఈ దేవాలయంలో ఓ అద్భుత ద‌ృశ్యం ఆవిష్కృతమైంది. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల నేపథ్యంలో ఏటా రెండు సార్లు సూర్యుడి కిరణాలు సూర్యభగవానుడిని తాకుతూ ఉంటాయి. అయితే దక్షిణాయణంలో మొదటి రోజు లేలేత సూర్య కిరణాలు మూలవిరాఠ్‌ను తాకాయి.

ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి భక్తులు మైమరిచి పోయారు. గత మూడు సంవత్సరాలుగా సూర్య కిరణాలు మూలవిరాట్ ని తాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు భక్తులు. అయితే ఈ ఏడాది సూర్యకిరణాలు భగవంతుడిని స్పృశించడాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. అయితే సూర్యకిరణాలు స్వామివారిని రేపు కూడా తాకే అవకాశం ఉందని ఆలయ పూజారి తెలిపారు.

Related News