Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సర్జికల్ స్ట్రైక్ 2.. మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గ అత్యవసర భేటీ

Category : world national

పుల్వామా దాడులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది . జైషే మహమ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసి ఉగ్రవాదుల స్తారాలను ద్వంసం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వాయుసేన బాంబుల మోత మోగించిన తర్వాత నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ , విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ , ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు రక్షణ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారులతో తాజా పరిస్థితి గురించి ఆరా తీశారు వైమానిక దాడులు జరిగిన తీరు, ఉగ్రవాద స్థావరాల ధ్వంసం, వైమానిక దాడులపై పాకిస్తాన్ స్పందన వంటి విషయాలపై చర్చించారు.

Related News