//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పళనిస్వామి కంటికి శస్త్రచికిత్స

Category : politics

చెన్నై రాష్ట్ర ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామి కంటికి శస్త్రచికిత్స జరిగింది.

స్థానిక టి.నగర్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రి లో ఆయన కంటి ఆపరేషన్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ తర్వాత ఆయన కోలుకుని అడయార్‌ గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన నివాసగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఎడప్పాడి గత కొంతకాలంగా కంటిపొరల కారణంగా బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన ఇంటిపట్టునే వుండి కంటి వైద్య నిపుణులతో చికిత్స తీసుకుంటున్నారు. చివరకు వైద్యుల సలహా మేరకు ఆయన టి.నగర్‌లోని ప్రైవేటు కంటి ఆస్పత్రిలో చేరి ఆపరేషన్‌ చేయించుకు న్నారు. రెండు రోజులపాటు ఆయన ఇంటిలోనే విశ్రాంతి తీసుకోనున్నారు.

దీనితో రెండు రోజులపాటు ముఖ్య మంత్రి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొన బోరని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

Related News