మూడు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీని టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా, ఆయన భార్య ప్రియాంక అమ్‌స్టర్‌డామ్‌లో కలుసుకున్నారు. ప్రధానిని తమ దంపతులు కలుసుకున్న ఫోటోను సురైష్ రైనా ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 'గోల్డెన్ విజన్' ఉన్న నరేంద్ర మోదీని నెదర్లాండ్స్ పర్యర్యటన సందర్భంగా తమ దంపతులు కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మోదీ నెదర్లాండ్స్ పర్యటనకు ముందు అమెరికాలో డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమై అనంతరం పోర్చుగల్ సందర్శించారు. కాగా, రైనా ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన ట్వంటీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడారు. 2017 ఛాంపియన్స్ ట్రోపీ టీమ్‌లో కీలకంగా నిలిచారు. టోర్నమెంట్ అనంతరం యూరప్‌లో హాలిడే ట్రిప్‌లో ఉన్న రైనా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే ఫిట్నెస్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను కూడా ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.