//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజీనామాకు సిద్ధపడిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు

Category : national

వ‌రుస రైలు ప్ర‌మాదాల‌తో క‌ల‌త చెందిన రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భు రాజీనామా చేస్తానంటూ ప్ర‌ధాని నరేంద్ర మోదీని క‌లిశారు. అయితే మోదీ మాత్రం వేచి చూడాల‌ని చెప్పిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త శ‌నివారం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన ఉత్క‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంలో 23 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌మాదం త‌ర్వాత రైల్వే మంత్రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ప్ర‌మాదానికి బాధ్య‌త వ‌హిస్తూ ఇప్ప‌టికే రైల్వే బోర్డు చైర్మ‌న్ ఏకే మిట్ట‌ల్ రాజీనామా చేశారు. ఆయ‌న రాజీనామాను ప్ర‌భు ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఇంత‌లో ఆయ‌నే రాజీనామాకు సిద్ధ‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.

ఈ ప్ర‌మాదాల‌కు తాను పూర్తి నైతిక‌ బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు సురేశ్ ప్ర‌భు స్ప‌ష్టంచేశారు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత బాధ్య‌లెవ‌రో వెంట‌నే తేల్చాల‌ని అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించారు సురేశ్ ప్ర‌భు. మెయింటెనెన్స్ సిబ్బంది త‌ర‌ఫు నిర్లక్ష్యం కార‌ణంగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని రైల్వే బోర్డు ఇంజినీరింగ్ మెంబ‌ర్ అశోక్ మిట్ట‌ల్ చెప్పారు.

ఇలా ఉండగా సుమారుగా మూడేళ్ళుగా తాను రైల్వే ల అభివృద్ధి కోసం తన రక్తం, చెమటను ధారపోసి కృషి చేస్తున్నానని, దశాబ్దాలుగా ఈ రంగంలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిచేయడం కోసం పలు సంస్కరణలు చేపట్టడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులకు కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తు జరుగుతున్న రైల్వే ప్రమాదాలు, వాటి అల్లన పలువురు గాయాలకు గురి కావడం, విలువైన ప్రాణాలు కోల్పోతూ ఉండటం పట్ల తాను ఎంతో మనోవేదనకు గురవుతున్నట్లు విచారం వ్యక్తం చేశారు.