Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తమ పై కామెంట్స్ చేసిన వారికి ....దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన సురేఖ వాణీ కూతురు సుప్రీత.

Category : movies

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ మధ్య కాలంలో ఎవరికీ ఏం తోచిన దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. ఎక్కడ రాజీ లేకుండా వారికి ఏం అనిపిస్తే అది, ఏం చెప్పాలని పిస్తే అలా చేసుకుంటూ పోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అక్కడే వచ్చింది. అసలు చిక్కు.... నువ్వు నీకు నచ్చినట్టు చేసే ప్రతి పనిని ...మేము మాకు నచ్చినట్టు కామెంట్స్ చేస్తాం అంటూ వీర లెవల్ లో భాదే స్తున్నారు.. ఈ లెక్కన కొందరు స్టార్ కిడ్స్ పై....మరికొందరు నెటిజనులు తమ అభిప్రాయాన్ని సూటిగా చెప్పడం బాగానే ఉంది కానీ.. మరీ హద్దు మీరి వ్యక్తిగత విషయాల్లో కి వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీల్ని మరీ హర్టయిపోయేలా తిట్టేయడం.. మనసు గాయపరచడం లాంటి బ్యాడ్ ట్రెండ్ నడుస్తోంది. ఇంతకీ ఆ గొడవేంటొ ఓ సారి చూస్తే....ప్రముఖ నటి సురేఖ వాణి గురించి అందరికీ తెలిసిందే.ఓ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమేకంటు ఓ సొంత ఇమేజ్ ఉంది.

తనదైన అందం అభినయంతో తనకంటూ ఫ్యామిలీ ఆడియెన్స్ మంచి పేరే తెచ్చుకున్న సురేఖ వాణికి ఓ కూతురు ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈమె డాటర్ సుప్రీత సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఇంకా టీనేజ్ లో ఉన్న ఈ అమ్మడు కి సోషల్ మీడియాలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. డబ్ స్మాస్, టిక్ టాక్ అంటు చాలా ఆప్స్ లో తనదైన అంద చందాలతో అమ్మ కు మించిన అందంతో రెచ్చిపోయే ఈ అమ్మడు.ఇప్పటికే చాలా రకాల వీడియోల్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో అప్ లోడ్ చేస్తూ అభిమానుల పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుంది. అందులో ఫన్ తో పాటు ఎమోషన్ తో కూడుకున్నవి ఉన్నాయి. అయితే ఇదే వేదికపై తన తండ్రి చనిపోయినప్పుడు తలకొరివి పెట్టిన వీడియోల్ని సైతం ఆమె షేర్ చేయడంతో నెటిజనులు తమకు తోచిన కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఛాన్స్ దొరకాలే కానీ.. ఆమెను ఓ లెవల్ లో ఏకి పారేశారు.

దీంతో సురేఖ వాణి కూతురు మనసు గాయపడిందిట.అందుకే తనను తిట్టిన వాళ్లకు సమాధానం కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చింది ఈ అమ్మడు.అయితే తాజాగా ఓ మెసేజ్ లో ట్రోలర్స్ ని ఉద్ధేశించి సుప్రీత ఘాటైన కామెంట్ ని పోస్ట్ చేశారు. "మాపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నవారు అలా చేసేముందు అన్నీ తెలుసుకోవాలి. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్నే చూపిస్తాయన్నది గుర్తుంచుకోవాలి. ముందు నీ లైఫ్ జాగ్రత్త. తర్వాత ఇతరుల విషయాల్లో వేలు పెట్టండి. నువ్వు నీవైపు నుంచే చూస్తున్నావ్. అలా కాదు నా వైపు నుంచి చూడు. నా కోణంలో ఆలోచించు" అంటూ ఫుల్ గా క్లాస్ తీస్కుంది. ఆ తర్వాత తన ఇన్ స్టాగ్రమ్ ఖాతా కూడా మాయమైంది. భర్త మరణం తర్వాత ఆ వ్యధ నుంచి తన తల్లి ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని చెప్పుకొచ్చిన సుప్రీత అచ్ఛం ఈ కాలం అమ్మాయిలా స్పందించడం విశేషం.

Related News