//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉరికి సై అన్న...సుప్రీం..

Category : national state

దేశ వ్యాప్తంగా అల్లకల్లోల సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు మరణ శిక్షే సరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పును ఖరారు చేసింది. న్యాయం పేరిట తమను హత్య చేస్తున్నారని, కింది కోర్టులు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించాలని నిందితులు ముఖేష్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించడానికి తగిన కారణాలు ఏమీ నిందితులు చెప్పలేదని స్పష్టం చేసింది. తీర్పులో లోపాలు ఉన్నాయని చెప్పిన నిందితులు.. వాటిని ఎత్తి చూపడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.స్నేహితుడితో కలిసి వెళ్తున్న పారా మెడికల్ విద్యార్ధి నిర్భయపై 2012 డిసెంబరు 16న దేశ రాజధాని నడిబొడ్డున ఆరుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.ఢిల్లీ మొత్తం ర్యాలీల రోడ్ షోగా మార్చింది..మొదటగా యావత్ యువతను కదిలించిన ఈ ఈ ఘటనలో విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో రాంసింగ్‌ తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోంకు తరలించారు. మూడేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకున్న తర్వాత అతడు విడుదలయ్యాడు.నాలుగు కామాందులను జైల్లో ఉంచగా వారికీ నిన్నటితో ముగింపు పలికింది సుప్రీం.ఏడాది మే 5న సుప్రీం కోర్టు ఖరారు చేశాయి. దీనిపై ముఖేష్‌, పవన్‌, వినయ్‌ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసినా.. అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ అనే మరో దోషి మాత్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలేదు. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే, క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.దీనికోసం దేశం మొత్తం ఏక కంఠంతో ఉరికి సిద్ధం చేయాలనీ నినాదాలు చేసాయి...దీనితో ఏ మగాడు ఆడ పిల్ల అంటే గౌరవించాలి తప్ప కామాంధుడిగా చెరబడితే ఉరితాడు ఒడిలో చేరాక తప్పదని యావత్ భారత్ లోకం ముక్త కంఠంతో కూసింది...

Related News