//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం కేసీఆర్‌కు సుప్రీం, హై కోర్టులు భ‌యంక‌ర‌మైన షాక్‌..!

Category : state politics

తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ‌చ్చిప‌డ్డ చిక్కుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఒక వైపు పార్టీలో టిక్కెట్ల కేటాయింపుతో గులాబీ పార్టీకి ముళ్లు గుచ్చుకుంటుంటే మ‌రో వైపు ఈ ప్ర‌క్రియ‌పై విప‌క్షాలు ఎదురుదాడిని శ‌రామామూలుగానే కొన‌సాగిస్తున్నాయి. Supreme court and High court gives big shock to KCR

ఇవి చాల‌ద‌న్న‌ట్టు కోర్టు కేసులు కూడా వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో సంబంధం ఉన్న ఓ కేసు ఏకంగా దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానంకు చేరింది. రాష్ట్రంలో గ‌డువుకంటే ముంద‌ర‌గా.. ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల పౌరుల‌కు న‌ష్ట‌మ‌ని పేర్కొంటూ సిద్దిపేట‌కు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.Supreme court and High court gives big shock to KCR

రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి, రాజ‌కీయ సంక్షోభం లేక‌పోయినా కేవ‌లం రాజ‌కీయ‌ప‌ర‌మైన ల‌బ్ధి కోస‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం పిటిష‌న‌ర్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న విధించాల‌ని కోరారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సుప్రీం కోర్టులో చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే.. మ‌రో వ్య‌క్తి.. మ‌రో అంశంపై హైకోర్టును ఆశ్ర‌యించారు. తెలంగాణ‌లో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ పూర్తి స్థాయిలో పూర్తి కాలేద‌ని, అర్హులైన ల‌క్ష‌లాది మంది ఓట‌ర్ల పేర్లు గ‌ల్లంత‌య్యాయ‌ని, అందుకే ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను నిల‌పాల‌ని హైకోర్టులో ఈ పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. Supreme court and High court gives big shock to KCR

దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు విశేష అధికారాలు ఉంటాయ‌ని, ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హించాలో ఎన్నిక‌ల సంఘం చూసుకుంటుంద‌ని, ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకోలేమ‌ని హైకోర్టు పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ శంశాంక్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. తెలంగాణ‌లో సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యానికి దాదాపు 20 ల‌క్ష‌ల మందికి పైగా యువ‌త ఓటు హ‌క్కు పొందే అవ‌కాశం ఉంటుంద‌ని, ముంద‌స్తు ఎన్నిక‌ల వ‌ల్ల వారంతా ఓటు హ‌క్కు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు.

రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కును కాల‌రాసే విధంగా ఉంద‌న్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పేర్కొంటూ పిటిష‌న‌ర్ త‌మ త‌రుపున వాద‌న‌ల‌ను వినిపించారు. స్వ‌యంగా సీఎం కేసీఆరే.. ఎన్నిక‌ల సంఘంతో చ‌ర్చించిన త‌రువాత‌.. ఎన్నిక‌ల‌కు వెళ్తున్నామ‌ని చెప్ప‌డం అర్ధ‌ర‌హిత‌మ‌న్నారు. పాల‌నా స‌మ‌యంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, మ‌ళ్లీ తానే ముఖ్య‌మంత్రి అవుతాన‌ని కేసీఆర్ చెప్ప‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని పిటిష‌న‌ర్ వాద‌న‌లను వినిపించారు. ఈ దెబ్బ‌తో కేసీఆర్‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల డ్రామాను న‌డ‌పాల‌నే ప్లాన్ ఫెయిల్ అయ్యేలా క‌నిపిస్తోందని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.