//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రైవ‌సీ ప్రాధమిక హక్కన్న సుప్రీం.. ఆధార్ భవిష్యత్ ?

Category : national

వ్య‌క్తిగ‌త గోప్య‌త‌ (ప్రైవ‌సీ) ప్రాధమిక హక్కే అని సుప్రీం కోర్ట్ చ‌రిత్రాత్మ‌క తీర్పును వెలువ‌రించింది. తొమ్మిది మంది స‌భ్యుల ధ‌ర్మాస‌నం ప్రైవ‌సీని ప్రాథ‌మిక హ‌క్కుగా ఏక‌గ్రీవంగా తేల్చింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21 ప్రకారం వ్య‌క్తిగ‌త గోప్య‌త ప్రాథ‌మిక హ‌క్కేన‌ని స్పష్టం చేశారు. 

సుప్రీంకోర్టులోని రూమ్‌నెంబ‌ర్ వ‌న్‌లో న్యాయ‌మూర్తులు తీర్పును వెలువ‌రించారు. 1962, 1954 సంవ‌త్స‌రాల్లో ప్రైవ‌సీపై సుప్రీం ఇచ్చిన తీర్పును ప్ర‌స్తుత ధ‌ర్మాస‌నం కొట్టిపారేసింది. ప్రైవ‌సీ ప్రాథ‌మిక హ‌క్కు అని వ‌చ్చిన తీర్పుల‌న్నీ నిజ‌మైన‌వ‌ని చీఫ్ జ‌స్టిస్ ఖేహ‌ర్ అన్నారు. వ్య‌క్తిగ‌త గోప్య‌త జీవితానికి సంబంధించిన అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

ప్రైవ‌సీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ‌ల్ల ఇత‌ర కేసుల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశాలున్నాయి. ప్ర‌ధానంగా ఆధార్‌పై ప్రైవ‌సీ తీర్పు ప్ర‌భావం చూపనుంది.  ఆధార్‌లో ఉండే బ‌యోమెట్రిక్ డేటాను ప్ర‌భుత్వం అన్ని అంశాల‌కు జోడించే ప్రయత్నాలు  వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుప్రీం తీర్పు కీల‌కంకానున్న‌ది. 

ఆధార్ నెంబ‌ర్‌ ద్వారా వ్య‌క్తిగ‌త విష‌యాల‌న్నీ వెల్ల‌డ‌వుతున్న త‌రుణంలో సుప్రీం తీర్పు ఆధార్ అనుసంధాన ప్ర‌క్రియ‌పై ప్ర‌భావం ప‌డే ఛాన్సుంది. వ్య‌క్తిగ‌త గోప్య‌త‌పై సుప్రీం ఇచ్చిన తీర్పును బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి స్వాగ‌తించారు. సుప్రీం తీర్పుపై ఆయ‌న ట్వీట్ చేశారు. ప్రైవ‌సీని ప్రాథ‌మిక హ‌క్కుగా గుర్తించారు, ఇప్పుడు ఆధార్ గురించి స‌మీక్షించాల‌ని కోరారు.