//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ట్రిపుల్ త‌లాక్‌ రాజ్యాంగ వ్యతిరేకం అన్న సుప్రీం

Category : national

వివాదాస్ప‌ద‌ ఇస్లామిక్ సాంప్ర‌దాయం ట్రిపుల్ త‌లాక్‌పై అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్ట్  ఇవాళ సంచలనమైన తీర్పు ఇచ్చింది.. ట్రిపుల్ త‌లాక్ ప‌ద్ద‌తి రాజ్యాంగ వ్యతిరేకం అని ముగ్గురు న్యాయమూర్తులు పేర్కొనగా, తాజాగా బద్దమే అని మరో ఇద్దరు సమర్ధించారు. ఆ సాంప్ర‌దాయానికి సంబంధించి చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. 

 3-2 తేడాతో కోర్టు ట్రిపుల్ త‌లాక్ పిటీష‌న్‌ను కొట్టివేసింది. ఆ ప‌ద్ధ‌తి అక్ర‌మ‌మ‌ని తేల్చేసింది. ఖురాన్ అంగీక‌రించ‌ని అంశాల‌ను రాజ్యాంగం ప‌రిర‌క్షించ‌లేదు అని కోర్టు పేర్కొన్న‌ది. ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ త‌లాక్‌ను బ్యాన్ చేశార‌ని, మ‌రి స్వ‌తంత్ర భార‌త దేశంలో దాన్ని ఎందుకు తొలిగించ‌లేమ‌ని కోర్టు ప్ర‌శ్నించింది. 

జ‌స్టిస్ రోహింట‌న్ ఫాలీ నారీమ‌న్‌, జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్‌, జ‌స్టిస్ కురియ‌న్ జోసెఫ్‌లు ట్రిపుల్ త‌లాక్ ప‌ద్ధ‌తిని రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌న్నారు. చీఫ్ జ‌స్టిస్ ఖేహ‌ర్‌, జ‌స్టిస్ నాజిర్ మాత్రం ట్రిపుల్ త‌లాక్ రాజ్యాంగబ‌ద్ద‌మ‌న్నారు. అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నంలో ముగ్గురు ఆ ప‌ద్ధ‌తిని రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌న్నారు. దీంతో చీఫ్ జ‌స్టిస్ ఈ కేసును 3-2 తేడాతో ప‌క్క‌న పెట్టేశారు.

ట్రిపుల్ త‌లాక్‌పై అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ తీర్పును వెలువ‌రించింది. ట్రిపుల్ త‌లాక్‌పై చీఫ్ జ‌స్టిస్ ఖేహ‌ర్ తీర్పును చ‌దివి వినిపించారు. కేంద్రం చ‌ట్టం తెచ్చే వ‌ర‌కు ట్రిపుల్ త‌లాక్‌పై ఎటువంటి పిటీష‌న్లు స్వీక‌రించ‌మ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌రో ఆరు నెల‌ల లోపు ట్రిపుల్ త‌లాక్‌పై చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ అంశంపై రాజ‌కీయాల‌ను ప‌క్క‌నబెట్టి, అన్ని పార్టీలు క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టు సూచించింది. ఇప్ప‌టి నుంచి ఆరు నెల‌ల పాటు ట్రిపుల్ త‌లాక్ ప‌ద్ద‌తి అమ‌లులో ఉండ‌దు అని కోర్టు చెప్పింది. భార‌త రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 14, 15, 21, 25ల‌ను త‌లాక్‌-ఇ-బిద్ద‌త్ ఉల్లంఘించిన‌ట్లు లేద‌ని ఖేహ‌ర్ తెలిపారు. వ్య‌క్తిగ‌త చ‌ట్టం ద్వారా ఆ ప‌ద్ధ‌తి అమ‌లులో ఉంద‌ని పేర్కొన్నారు. 

చ‌ట్టం త‌యారు చేసేట‌ప్పుడు ముస్లిం సంస్థ‌ల అభిప్రాయాలు, ష‌రియా చ‌ట్టాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కోర్టు ప్ర‌భుత్వానికి సూచించింది. ఒక‌వేళ ఆర్నెళ్ల‌లో ట్రిపుల్ త‌లాక్‌పై చ‌ట్టాన్ని చేయ‌లేక‌పోతే, అప్పుడు ట్రిపుల్ త‌లాక్‌పై ఇన్‌జంక్ష‌న్ కొన‌సాగుతుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఇస్లామిక్ దేశాల్లో ట్రిపుల్ త‌లాక్‌ను బ్యాన్ చేశార‌ని, మ‌రి స్వ‌తంత్ర భార‌త దేశంలో దాన్ని ఎందుకు తొలిగించ‌లేమ‌ని కోర్టు ప్ర‌శ్నించింది.