//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇద్దరు గుజరాత్ పోలీస్ అధికారుల నియామకానికి సుప్రీం చెక్ !

Category : national

సోహ్రాబుద్దీన్ షేక్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ హత్యలతో సంబంథం గలదని భావిస్తున్న ఇద్దరు సీనియర్  పోలీస్ అధికారులను గుజరాత్ ప్రభుత్వం తిరిగి నియమించడాన్ని  సుప్రీం కోర్ట్ తప్పు పట్టింది. ఎన్ కె అమిన్, టి ఏ బారోట్ లను గురువారం సాయంత్రం లోగా తమ పదవుల నుండి వైదొలగాలని ఆదేశించింది . ఈ విషయమై తన స్పందన తెలుపడానికి గుజరాత్ ప్రభుత్వానికి ఒక రోజు వ్యవధి ఇచ్చింది. ఈ ఎన్కౌంటర్ హత్యలు  ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆత్మరక్షణలో పడవేయడం తెలిసిందే.

 ప్రధాన న్యాయమూర్హ్టి జె యస్ ఖేహర్, న్యాయమృతి డి వై చంద్రచూడ్ లతో కూడిన బెంచ్ ఈ అసాధారణ ఆదేశం జారీచేసింది. సోహ్రాబుద్దీన్ 2005లో భార్య కౌసర్బీ మృతదేహాన్ని తరలించడంలో బాధ్యుడిగా భావిస్తూ ఉండగా ఆగష్టు, 2016లో పోలీస్ సూపరింటెండెంట్ గా ఉద్యోగ విరమణ చేశారు. కానీ తిరిగి ఒక సంవత్సరానికి మహిసాగర్ జిల్లా ఎస్పీ గా నియమించారు. రిటైర్మెంట్ తరువాత బారోట్ ను వడోదరలో పశ్చిమ రైల్వే డిఎస్పీ గా ఒక సంవత్సర కాలానికి నియమించారు.

తనపై రెండు కేసులలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, సుమారు ఎనిమిదేళ్లు జ్యూడిషియల్ కస్టడీలో గడిపానని అమిన్, విడుదల తరువాత తిరిగి ఎస్పీ గా నియమించారని అమిత్ సుప్రీం కోర్ట్ కు తెలిపారు. బారోట్ కూడా అపహరణ, హత్యా కేసులలో అరెస్ట్ అయి సుమారు మూడేళ్లు జ్యూడిషియల్ కస్టడీ లో గడిపారని, విడుదల తరువాత నియామకం పొందారని పేర్కొన్నారు. అయితే వారిద్దరిని తిరిగి నియమించడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఐ పి యస్ అధికారి రాహుల్ శర్మ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. అంతకు ముందు ఆయన అభ్యర్ధనను గుజరాత్ హై కోర్ట్ కొట్టివేసింది.