Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సూపర్ స్టార్ రజనీకాంత్ పై .... బీజేపీ సీనియర్ ఎంపీ తీవ్ర విమర్శలు.

Category : politics

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే బిజీపి సీనియర్ నేత సుబ్రమణ్యస్వామికి ఎప్పుడూ చిన్న చూపే అని చెప్పాలి. గతం లోనూ ఈయన పలు సందర్భాల్లో రజనీకాంత్ ను విమర్శించారు సుబ్రమణ్య స్వామి. ఈ క్రమంలోనే మరోసారి రజనీకాంత్ తీరుపై ఈ బీజేపీ నేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చినట్టే అని ప్రకటించి పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోవడం విషయంలో రజనీకాంత్ తీరుపై సుబ్రమణ్యస్వామి విమర్శలు చేశారు.రజనీకాంత్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ నాటకాలు ఆడుతున్నారనీ వ్యాఖ్యానించారు ఈ బీజేపీ ఎంపీ. రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చి ప్రజా సమస్యల పై ఏ మాత్రం పోరాటం కొనసాగించకుండా రజనీకాంత్ నాటకాలు ఆడుతున్నారంటూ స్వామి వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ విధానాలను ఇటీవల రజనీకాంత్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి నదుల అనుసంధానం గురించి సూపర్ స్టార్ కుడా ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ అంశాన్నే సుబ్రమణ్య స్వామి ప్రస్తావిస్తూ......బీజేపీ సిద్దాంతాలు నచ్చినప్పుడు ఆ పార్టీలోకి ఎందుకు చేరడం లేదన్నట్టుగా స్వామి ప్రశ్నించారు.రజనీకాంత్ రాజకీయాల మీద ఎందుకు పూర్తి స్థాయిలో స్పష్టతను ఇవ్వడం లేదంటూ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము రెడీ అని ఇది వరకూ రజనీకాంత్ ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలప్పుడు మీడియా ముందుకు వచ్చి ఆ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించిన రజనీకాంత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి తమ పార్టీ పోటీలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పై సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు.కేవలం మాటలకే పరిమితం అయిన రజనీకాంత్ రాజకీయాల్లోకి పనికిరాడని పరోక్షంగా చెప్పుకొచ్చారు.