//single page style gallary page

Superstar Rajinikanth Life Story Joining your textbooks Tamil Nadu government to take decision.

Category : history

Click here to read this article in Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టోరీ నీ పాఠ్యపుస్తకాల్లో చేరుస్తూ..... నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం.

ఏ వ్యక్తి అయినా తన జీవితంలో కోట్లు సంపాదించిన రాని గౌరవం ,మర్యాద,గుర్తింపు తాను చేసే పనిని బట్టి ,తాను జీవించే విధానం, ఆహారపు అలవాట్లే తనను ఓ గొప్ప వ్యక్తిగా కీర్తిస్తాయని ఈయనను చూస్తే నే అర్థం అవుతుంది.పేరుకే సూపర్ స్టార్ కానీ ఆయన ఉండే తీరులో మాత్రం ఓ సాధారణ వ్యక్తే.ఇంతకీ ఆయనోవరో మీకిప్పటికే అర్దం అవుతుంది. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్..... ఈ పేరు వింటేనే దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ ఊగిపోతుంది. ఆయన స్టైల్ అన్నా, డైలాగ్స్ అన్నా ఆ క్రేజే వేరు. కార్పెంటర్‌ నుంచి, కండక్టర్‌ గా అక్కడి నుంచి తమిళ సినీ పరిశ్రమనే రూల్ చేసే అగ్ర నటుడిగా ఎదిగిన ఆయనకు l కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కేవలం దక్షిణాదినే కాకుండా యావత్తు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకు సెల్యూట్ చేస్తుంది.

ఎందుకంటే.. ఆయన వ్యక్తిత్వమే అందుకు కారణం అని చెప్పాలి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి రజనీకాంత్. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే ఆయన తీరే అందుకు నిదర్శనం. తమిళ నాడు నుంచి ఢిల్లీ దాకా ఆయనంటే ఇష్ట పడని వారు ఉండరు.చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఆయనో ఆరాధ్య నటుడు. కోట్లకు కోట్లు ఉన్నా,అంతకు మించిన స్టార్‌డమ్ ఉన్నా ఎక్కడ కూడా పొగరు తలకు ఎక్కని గొప్ప వ్యక్తి. అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ.. సేవా కార్యక్రమాల్లో తనదైన పాత్ర వహించే నిరాడంబరుడు ఆయన.అందుకే ఆయన ఉన్నతిని పడు మందికి స్ఫూర్తిగా తెలుపుతూ....ఇంతటి గొప్ప వ్యక్తిత్వమున్న రజనీకాంత్ గురించి విద్యార్థులకు తెలిపేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆయన జీవిత ప్రస్థానాన్ని తెలియజేస్తూ ఆయన తన జీవితంలో ఓ నంబర్ వన్ స్టార్ గా ఎలా ఎదిగారు అన్నది ఓ జీవిత పాఠం గా ఐదో తరగతి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చింది తమిళ నాడు ప్రభుత్వం. స్వయంకృషితో ఎదిగిన ప్రముఖులు అనే పాఠంలో రజనీకాంత్ గురించి ప్రస్తావించారు. చార్లీ చాప్లిన్, స్టీవ్ జాబ్స్, జేకే రౌలింగ్, ఫ్రాంక్ ఓడియా, ఓప్రా విన్‌ఫ్రే సహా రజనీ గురించి పాఠ్యాంశంలో చేర్చారు.తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సహా వివిధ భాషల్లో దాదాపు 160 సినిమాల్లో నటించారు రజనీకాంత్.అలాగే వయసు 70 కి సమీపిస్తున్న ఇంకా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.అలాగే తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా దర్బార్‌ ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా తెరకెక్కబోతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్శిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

I do not see any person living in the life of a person who does not get his / her honor, respect, and identity, and that he lives in the way that he lives, and the food habits are a great person. Will be understandable. He is superstar Rajinikanth ..... the South Indian film industry will hear this name. His style Anna and Dialogs Anna are different from that. From Carpenter, as a conductor, he has grown to become a leading actor in Tamil film industry and has millions of fans. The Indian Film Industry will salute him, not just the South.

Because the personality is the reason for that. Rajinikanth is close to audiences of all classes without the difference between Mass and Class. How much of his surprise is his proof of proof. He does not want to be from Tamil Nadu to Delhi. He is the actor from the small children to the old age. There are coats for crores, no matter where the stardom is beyond, where the smoker is the great guy. He is a very simple person and he is a simple person who has his own role in service activities. He is inspired by his superiors ... Tamil Nadu government has made a key decision to inform students about Rajinikanth,

It was a lifetime lesson in the fifth grade textbooks of how he grew up in his life as the number one star in his life. Rajinikanth is mentioned in the lesson of the celebrities who grew up with Swayakrishna. Rajinikanth, who has starred in around 160 films in different languages including Telugu, Tamil, Malayalam and Hindi, is also competing for Young Heroes, who are approaching 70 years of age as well as young heroes. AR Murugadas is directing the new movie Durbar Terakekkabotunna vanlo sick heroine. Anirudh Ravichander is providing music for this film.