//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆల్ టైమ్ గ్రేట్ రోల్ లో మెగాస్టార్..మండిపడుతోన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

Category : movies

మెగాస్టార్ చిరంజీవి సైరాలో హిస్టారికల్ క్యారెక్టర్ ఉయ్యాల వాడ నరసింహారెడ్డిని చేస్తోన్న సంగతి తెలిసిందే..ఈ మూవీతో ఆన్ స్క్రీన్‌తో పాటు పొలిటికల్‌గా కూడా మంచి మైలేజీ తెచ్చుకునేందుకు అన్నిఅవకాశాలు పరిశీలిస్తోన్న టీమ్ ఇప్పుడు మరో ప్లాన్ కూడా అమలు చేసిందట.

ఐతే అదే ఇప్పుడుసూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కలిగిస్తోందట. సూపర్ స్టార్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకుముందు గుర్తొచ్చేది కృష్ణే..ఆయన తర్వాతే మహేష్ బాబు పేరు గుర్తొస్తుంది..ఐతే ఈ ఇద్దరికీ కంబైన్డ్ ఫాలోయింగి విపరీతంగా ఉన్నారు కాబట్టి..వీళ్లకి కాస్త కోపం కలిగినా..అవతలి వ్యక్తులకు షాక్ బాగానే తగులుతుందిఇంతకీ మెగాస్టార్ చేసిన ఏ ప్రయత్నం వీళ్లకి మండుకొచ్చేలా చేస్తోందంటే..సైరా నరసింహారెడ్డిలో ఆ క్యారెక్టర్ఎండ్ అయిన తర్వాత అంటే 19వ శతాబ్దంలోని మిగిలిన స్వాతంత్ర సమరయోధుల పాత్రలను కూడా చూపించే ఆలోచన ఉందట..అలా అయితేనే మెగాస్టార్ చనిపోవడం అనే మైనస్ పాయింట్ నుఅధిగమించవచ్చని ఫ్యాన్స్‌ని ఖుషీ చేయవచ్చని దర్శక నిర్మాతల ఆలోచన.

అందులో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ ఆల్ టైమ్ హిట్ క్యారెక్టర్ అల్లూరి సీతారామరాజుని చిరంజీవి చేత ధరింపజేయాలనిఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది లీక్ అవడంతోనే కృష్ణ ఫ్యాన్స్ కి వళ్లు మండుకొచ్చింది..మా గురువుగారుచేసిన క్యారెక్టర్ నభూతో నభవిష్యత్..సాక్షాత్తూ ఎన్టీఆరే ఈ విప్లవజ్యోతి క్యారెక్టర్ చేద్దామని కూడాఅల్లూరి సీతారామరాజు చూసిన తర్వాత మానుకున్నారు..అలాంటి పాత్రని చిరంజీవి ఎందుకు చేయాలి..ఇదిదుస్సాహసం అంటూ విమర్శలకు దిగారు. వాస్తవానికి మెగాస్టార్ వయసు రీత్యా కూడా ఈ క్యారెక్టర్ ఆయనకు సూట్ అవదని చాలామంది వాదన. ఇప్పటికే ప్రేక్షకుల మనసులో అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణగారే గుర్తుకు వస్తారుఅందుకే ప్రిన్స్ మహేష్ కూడా ఆ క్యారెక్టర్‌ జోలికి పోవద్దని ఓపెన్‌గానే చెప్పేశాడు. అలాంటిది ఇప్పుడు సినిమా హిట్ అవ్వాలనే లక్ష్యంతో మెగా కాంపౌండ్ ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.